రాజీనామాలపై ఆ ఇద్దరూ వెనక్కి..

తమకు అధిష్టానం నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించిందని దామోదర్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పిందని, అందువల్ల తాము రాజీనామాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నామని ముత్యం రెడ్డి చెప్పారు. విద్యార్థులు ఆందోళన విరమించి చదువులపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. దామోదర్ రెడ్డి, ముత్యం రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తోనూ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతోనూ సమావేశమయ్యారు. మరో నాయకుడు దిగ్విజయ్ సింగ్ తోనూ వారు సమావేశం కాబోతున్నారు. తమ చర్చలు సఫలమయ్యాయని దామోదర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications