హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద తన భర్తపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ కేసు పెట్టి వేధిస్తున్నారని ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సోమవారం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపి ఎల్లుండి లోపు తమకు నివేదిక సమర్పించాలని కమిషన్ ప్రకాశం జిల్లా పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదు చేసిన మహిళ ఆలూరు ధనలక్ష్మి సెయింట్ ఆన్స్ అనే ప్రైవేట్ ఇంజినీరింగ్ కశాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.