వైయస్ పేరుతో చీఫ్ ఇంజినీర్ల నిర్బంధం

వారి వాహనాలకు అడ్డంగా రోడ్డుపైనే బైఠాయించారు. రైతులంతా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇంజినీరింగ్ అధికారులు కారు నుండి బయటకు కూడా రాలేకపోయారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ రాజోలి ఆనకట్ట వద్ద 3 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ పనులు పూర్తయితే దువ్వూరు, రాజుపాలెం, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు ప్రాంతాల్లోని రైతుల పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications