వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రతిపక్ష నేతగా వసుంధర రాజే రాజీనామా

ఆమె తన రాజీనామా లేఖను నిరుడు అక్టోబర్ 23వ తేదీన పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే దాన్ని స్పీకర్ కు అందజేయలేదు. లోకసభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహించి ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం నిరుడు ఆగస్టులో సింథియాను ఆదేశించింది. ఆదివారం రాత్రి తన విధేయులతో తీవ్రంగా చర్చించిన తర్వాత ఆమె స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించాలని నిర్ణయించుకున్నారు.