వరంగల్ జిల్లాలో యాదయ్య మృతి ప్రతిధ్వనులు

Warangal
వరంగల్‌: జిల్లాలోని ప్రధాన రహదారులు ఆదివారం రాస్తారోకోలతో స్తంభించిపోయాయి. రాజీనామాలు చేస్తామని వాగ్దానం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట తప్పడంతో ఆగ్రహం వ్యక్తమైంది. తెలంగాణ ద్రోహులుగా పేర్కొంటూ వారి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించారు. ఓయూ, కేయూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌, నిర్బంధాన్ని నిరసిస్తూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేంద్ర హోంమంత్రి చిదంబరం, ముఖ్యమంత్రి రోశయ్యల దిష్టిబొమ్మలను కూడా దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్ధి యాదయ్య ఆత్మాహుతి తెలంగాణ ఉద్యమకారులను మరోసారి కుదిపివేసింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన గళమెత్తారు. ప్రధాన రహదారులపై ధర్నాలు, రాస్తారోకో చేశారు.దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కరుణాపురంలో హైదరాబాద్‌, వరంగల్‌ ప్రధాన రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తొలుత హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ సింగరాజుపల్లి, దేవరుప్పులలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కడవెండిలో దొడ్డికొమురయ్య స్మారక స్థూపం వద్ద తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మలు దహనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+