వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు వద్దు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి కె రోశయ్య విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం సభ్యుల పట్టుతో ఆయన మంగళవారం శాసనసభలో విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, పోలీసులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.ఆత్మహత్యలను నివారించేందుకు విద్యార్థులు, రాజకీయ పార్టీలు కృషి చేయాలని ఆయన అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై, ధర్నాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన హర్షించారు.

తెలంగాణ సమస్యను కేంద్రం పరిశీలిస్తోందని, రాష్ట్ర పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేస్తోందని, ఈ సమయంలో అందరూ సంయమనం పాటించడం అవసరమని ఆయన అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తాను ఏ ఒక్క ప్రాంతానికో చెందినవాడినో కానని, ముఖ్యమంత్రిగా తనకు అన్ని ప్రాంతాలూ సమానమని ఆయన అన్నారు. దయచేసి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయవద్దని ఆయన కోరారు.

ఇది అత్యంత సున్నితమైన సమస్య అని, భావోద్వేగానికి సంబంధించిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్వేగంతో విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఉద్వేగంలో ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X