మే నుంచి విశాఖ-దుబాయ్ విమాన సర్వీసులు

Vishakapatnam
విశాఖపట్నం: ఎట్టకేలకు విశాఖ నగరానికి విదేశీ సర్వీసులు రానున్నాయి. విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం తెలిసిందే. ఈ ఏడాది మేలో దుబాయ్‌కి ఎయిర్‌బస్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్‌ లోని ఎమిరేట్స్‌ అనుబంధ సంస్థ అయిన ఫ్లై దుబాయ్‌ (ఎయిర్‌లైన్స్‌) సంస్థ భారత్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, పౌర విమానయానశాఖ డైరెక్టర్‌ జనరల్‌కి దరఖాస్తు చేసుకుంది. మరో 15 రోజుల్లో అనుమతుల వ్యవహారం ఓ కొలిక్కి రాగలదని సమాచారం.

భారత్‌ విమాన ప్రయాణికుల సంఘం ఆహ్వానం మేరకు ఫ్లై దుబాయ్‌ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆల్‌గెయిట్‌ మార్చిలో విశాఖ రానున్నారు. ఈ సంస్థ భారత్‌లో విశాఖతోపాటుగా చండీఘర్‌, కోయంబత్తూరు నగరాలకు విమానాలు నడిపేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ సర్వీసు మొదలైతే విశాఖనుంచి నాలుగు గంటల్లో దుబాయ్‌ చేరుకోవచ్చు. రానుపోనూ చార్జీల కింద సుమారుగా రూ.12వేలనుంచి 14 వేలు ఖర్చవుతుంది. ఎయిర్‌బస్‌-320 విమానాల్లో 140నుంచి 150 సీట్లుంటాయి.

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కృషి ఫలితంగానే దుబాయ్‌ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయని విమాన ప్రయాణికుల సంఘాధ్యక్షుడు డి.వరదారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖకు సింగపూర్‌ సర్వీసుల కోసం కూడా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని సిల్క్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధులు గత ఏడాది సర్వే చేయడం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే విశాఖ నగరం మరో మైలురాయి దాటినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+