మధు యాష్కీ వర్సెస్ లగడపాటి

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: ఇరువురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల మధ్య మాట యుద్ధం సాగింది. తెలంగాణకు చెందిన మధు యాష్కీకి, కోస్తాంధ్రకు చెందిన లగడపాటి రాజగోపాల్ కు మధ్య తీవ్ర వివాదం నడిచింది. కోస్తాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ లపై మధుయాష్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యాపారాల కోసం ఆ ముగ్గురు తెలంగాణను అడ్డుకుంటున్నారని, వారి రంగు బయటపెడతానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ ముగ్గురు ప్రభుత్వం నుంచి ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుందీ తాను వెల్లడిస్తానని ఆయన అన్నారు. ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్ ను వ్యాపార అవసరాలకు వాడుకుంటున్న రాయపాటి, లగడపాటి వంటివారికి నీతులు మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.

మధు యాష్కీ ఆరోపణలపై లగడపాటి తీవ్రంగా ప్రతిప్సందించారు. తమను బ్లాక్ మెయిల్ చేయడం ఆపి వాస్తవాలుంటే బయట పెట్టాలని ఆయన మధు యాష్కీని సవాల్ చేశారు. తమను బ్లాక్ మెయిల్ చేయడం వెనక ఉన్న మతలబు ఏమిటని ఆయన అడిగారు. కెసిఆర్, కోదండరామ్, జయశంకర్ హిట్లర్ లా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+