అమంచిపై రగడ: అసెంబ్లీ వాయిదా

Assembly
హైదరాబాద్: ఆమంచి సోదరుల ఆగడాలపై గురువారం శాసనసభలో తీవ్ర రగడ జరిగింది. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడి ఆగడాలపై విచారణకు సభా సంఘం వేయాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా చెప్పినా వారు పట్టించుకోలేదు. తెలుగుదేశం సభ్యులు పట్టువీడకపోవడంతో సబా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ను ఉద్దేశించి ఖమ్మం జిల్లాలో హేతువాది క్రాంతికిరణ్ రాసిన పుస్తకంపై మజ్లీస్ వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. కాగా, పుస్తక రచయిత క్రాంతికిరణ్ ను అరెస్టు చేశామని, పుస్తక రచన వెనక ఎవరున్నారనే విషయంపై విచారణ జరుపుతున్నామని, దీనిపై ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య మజ్లీస్ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో వారు సద్దుమణిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+