మెదక్: మెదక్ జిల్లా రేగోడ్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో మంగళవారం లభ్యమైన కండోమ్ ల వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ సుధాకర్ విచారణ జరిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కంప్యూటర్ ఆపరేటర్లతో విడివిడిగా మాట్లాడారు. కంప్యూటర్ ల్యాబ్‌ను సైతం తనిఖీ చేశారు. మధ్యాహ్నం వండిన భోజనాన్ని పరిశీలించారు. రేగోడ్ ఉప సర్పంచ్ శర్పుద్దీన్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాధాకిషన్ డిప్యూటీ డీఈఓతో మాట్లాడుతూ కండోమ్‌ల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేగోడ్, మర్పల్లి గ్రామస్తులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ ప్రవీణ్‌బాబు వారిని శాంతింపజేసి పాఠశాల వద్ద నుంచి పంపిం చారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం డిప్యూటీ డీఈఓ సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ విచారణలో బాధ్యులు ఎవరో తేలిన తర్వాత తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పాఠశాలలో జరగడం బా«ధాకరమని తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి