కెసిఆర్, కోదండరామ్ లకు పిండ ప్రదానం

ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కోదండరామ్ కుటుంబీకులు ఏసీ గదుల్లో సంతోషంగా గడుపుతుంటే, వీరిద్దరూ విద్యార్థులను రెచ్చగొట్టి వారి బతుకులను దుర్భరంగా మారుస్తున్నారని విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న కోదండరామ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు, విద్యార్థుల గురించి చెడుగా మాట్లాడడం తగదన్నారు. తెలంగాణ విద్యార్థులే ప్రొఫెసర్ కోదండరామ్‌పై దాడులు చేసే సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు నాగేంద్ర, నరసింహులు, వెంకటేశ్, రవితేజ, గంగాధర్, టీఎన్ టీయూసీ జిల్లా కార్యదర్శి కత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications