'భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి'

రాబోయే 30, 40 ఏళ్లలో ముస్లిం జనాభా 30శాతం పెరిగే అవకాశం ఉండడంతో దేశవిభజన జరిగే అవకాశం ఉందన్నారు. గోమాతకు తొగాడియా పూజలు విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌తొగాడియా బుధవారం ఉదయం భరతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు. దగ్గరలోని గోమాత, దూడకు పచ్చగడ్డి, గోధుమ రొట్టెలు తినిపించి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా గోలి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పలువురు తొగాడియాను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి సుధాన్షీపట్నాయక్, పూర్వాంధ్ర కార్యదర్శి ఎం.హనుమంతరావు, ప్రాంత ఉపాధ్యక్షుడు ఒబిలిశెట్టి శ్రీవెంటేశులు, ప్రాంత సంఘటన కార్యదర్శి జె.భాస్కర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మేకా సుబ్బారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాల కొండయ్య, ఆర్ ఎస్ ఎస్ కు నేతలు పాల్గొన్నారు. మంగళవారం అర్ధరాత్రి జగ్గంపేటలో తొగాడియాకు ఘనస్వాగతం లభించింది. స్థానిక గోలి సత్యకృష్ణ ఇంట్లో ఆయన బస చేశారు.












Click it and Unblock the Notifications