బాబూ! రూల్స్ చదువుకుని రా!: స్పీకర్

తాను కేశవ్ ను ఉద్దేశించి వాడిన పదాన్ని ఉపసంహరించుకున్నానని, అంతకు మించి ఇంకా ఏం కావాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబునుద్దేశించి అన్నారు. తెలుగుదేశం సభ్యుల తీరుపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యంతరం చెప్పారు. రాజకీయ అనుభవం లేకుండానే సభకు వచ్చామా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆమంచి కృష్ణమోహన్ అక్రమాల ఆరోపణలపై జీరో అవర్ లో ప్రస్తావించారని, నోటీసు ఇచ్చి మరో రూపంలో చర్చకు వస్తే ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పీకర్ చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రోశయ్య సభ నడుస్తున్న తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము పారిపోవడం లేదని, అన్నింటిపైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. సభ సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. గొడవ వల్ల సభ అప్రతిష్టపాలు అవుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications