నెల్లూరు: సింహపురి ఎక్స్ ప్రెస్ రైల్లో 16 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. రైలు ఎస్ 5కోచ్ లోని బాత్ రూంలో ఆమె శవం పడి ఉంది. యువతి మృతదేహాన్ని నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని తోటి ప్రయాణికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బిట్రగుంట రైల్వే స్టేషన్ లో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యువతిని గొంత నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె రిజర్వేషన్ చేయించుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆమె వివరాలను పట్టుకోవడం కష్టంగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.