బడ్జెట్ లో బెజవాడ డివిజన్ కు ప్రాధాన్యం

Vijayawada
విజయవాడ: రైల్వే బడ్జెట్‌లో విజయవాడ డివిజన్ కు సంబంధించి కొన్ని ప్రాజెక్టులకు ఆమోద ముద్ర లభించింది. కొత్త రైళ్లు దక్కాయి. మచిలీపట్నం స్టేషన్‌లో 24 కోచ్‌ల రైలు ఆగేవిధంగా ప్లాట్‌ఫారాల విస్తరణకు నిధులు మంజూరైయినట్లు సమాచారం. విజయవాడలో ప్రాంతీయ స్థాయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం, విజయవాడ-భీమవరం-నర్సాపూర్‌-నిడదవోలు డబ్లింగ్‌ పనులకు మమత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చే అవకాశం కనబడుతోంది. పది ప్రాజెక్టులు కేటాయించినట్లుగా ప్రకటించినా, ప్రణాళిక సంఘం అనుమతితో అనే మెలిక పెట్టారు. ప్రణాళిక సంఘం ఎంతవరకు అనుమతిస్తుందో, మన పార్లమెంట్‌సభ్యులు ఈ దిశగా ఎంతవరకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిందే. మరోవైపు విజయవాడకు అంతర్జాతీయ స్టేషన్‌ హోదా ఈ ఏడాదీ దక్కలేదు.

విజయవాడ-గుంటూరు-చెన్నైకు కొత్త పాసింజర్‌ రైలు మంజూరు అయ్యింది. కాకినాడ-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను షిర్డీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి, నిజాముద్దీన్‌-విశాఖపట్నం మధ్య కొత్త రైళ్లను మంజూరు చేస్తున్నట్లు మమత ప్రకటించారు. ఒకే బడ్జెట్‌లో ఇన్ని రైళ్లు రావడం ఇదే మొదటిసారి. కొత్తగా కొవ్వూరు-భద్రాచలం, నడికుడి-శ్రీకాళహస్తి, కొండపల్లి-కొత్తగూడెం, కోటిపల్లి-నర్సాపూర్‌ లైన్లు మంజూరు కాగా, జగ్గయ్యపేట-మిర్యాలగూడ లైన్ల సర్వేకు మమత అంగీకారం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+