ర్యాగింగ్ చేసిన విజ్ఞాన్ ఇంజినీరింగ్ విద్యార్ధుల సస్పెన్షన్
Districts
oi-Santaram
By Santaram
|
గుంటూరు: ఇక్కడికి సమీపంలోని వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులు సస్పెండయ్యారు. జడ్పీ చైర్మన్ విజయ కుమారుడితో సహా పలువురు విద్యార్థులపై సీనియర్లు కులం పేరుతో ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదయింది. ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిరోధ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వీరిపై అభియోగాలు మోపారు. ఈ సంఘటనతో సంబంధమున్న నలుగురు విద్యార్థులను విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసిందని సోమవారం పోలీసులు తెలిపారు.
అయితే ఆ నలుగురు అగ్రవర్ణ విద్యార్ధులను అరెస్టు చేసిందీ లేనిదీ పోలీసులు స్పష్టంగా చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. కళాశాల యాజమాన్యం తీసుకున్న చర్యలను చెబుతున్నారే కానీ తాము తీసుకున్న చర్యలను పోలీసులు చెప్పలేకపోతున్నారు. నేడు సెలవు దినం కావడంతో రేపు అరెస్టులను చూపే అవకాశముందని భావిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి