బాబాను దర్శించుకున్న రతన్ టాటా

Ratan Tata
పుట్టపర్తి: ప్రముఖపారిశ్రామికవేత్త రతన్‌ టాటా సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన బుధవారం సాయంత్రం 4.35 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబై నుంచి పుట్టపర్తికి వచ్చారు. స్థానిక సత్యసాయి విమానాశ్రయంలో ఆయనకు ప్రశాంతి నిలయం ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయం శాంతిభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ఐదు గంటలకు సాయికుల్వంత్‌ సభామందిరానికి చేరుకున్నారు.

అక్కడ రెండుగంటల పాటు బాబాదర్శనార్థం వేచిచూశారు. ఏడు గంటలకు యజుర్వేద భవనం నుంచి సభామందిరానికి బాబా చేరుకుని దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రతన్‌టాటాను బాబా పలుకరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని ఆశీస్సులు అందజేశారు. గురువారం ఉదయం తిరిగి బాబాను ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశముంది. ఆతర్వాత ఇక్కడి నుంచి ముంబై బయలుదేరి వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+