చెన్నై: నిత్యానందస్వామి సినీనటి రంజితతో సెక్స్ చేస్తుండగా తీసిన అశ్లీల సీడీలు ఓ మహిళే మీడియాకు పంపినట్లు విచారణలో తెలుస్తోంది. అయితే ఆ మహిళ ఎవరో అన్న ఉత్కంఠం నెల కొంది. టీవీల్లో కన్పించిన దృశ్యాల ఆధారంగా సదరు నటే పథకం ప్రకారం ఈ వ్యూహం పన్నిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పదే పదే అశ్లీల దృశ్యాలను ప్రసారం చేసిన టీవీ చానల్‌తో పాటు వాటికి మరించి ప్రాచుర్యం కల్పి స్తూ వార్తలు రాసిన పత్రికలపై ముఖ్యమంత్రి కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలను చూపించడం ద్వారా యువత పెడదోవపడుతుందని అక్షింతలు వేశారు.
ఆ నటి స్వామికి ఒక టాబ్లెట్, నీళ్ళు ఇవ్వడం, ఆ తర్వాత స్వామి సెక్సువల్ గా రెచ్చిపోవడం స్పష్టంగా ఆ వీడియోలో కన్పించింది. స్వామి వేసుకున్నది వయాగ్రా టాబ్లెట్ అని భావిస్తున్నారు. ఒక దశలో స్వామి లైట్ తీసేయబోవడం, అందుకు ఆ నటీమణి అడ్డు చెప్పడం కూడా కన్పించింది. లైట్ తీస్తే కెమెరాలో ఏదీ పడదన్న ఉద్దేశంతోనే ఆమె అలా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్వామిని బ్లాక్ మెయిల్ చేయడానికి రంజిత స్వయంగా ఇందుకు కుట్ర పన్ని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రంజిత దొరికితే పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేట్ చేసి నిజం రాబట్టే అవకాశముంది.