ప్రధాని వ్యాఖ్యలు అన్యాయం: కోదండరామ్

పార్టీలు ఎన్ని అభిప్రాయాలైనా చెప్పవచ్చునన్న శ్రీకృష్ణ కమిటీ ప్రకటనను కూడా ఆయన తప్పు పట్టారు. ఒక పార్టీ రెండు అభిప్రాయాలు చెప్తే దాన్ని రెండు పార్టీలుగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు తెలంగాణ ఫోరం ఏర్పాటు చేస్తే సరిపోదని, పార్టీపరంగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు. ఇంటర్ ప్రశ్నపత్రాలు స్థానికంగా దిద్దడం కుదరదని అధికారులు అనడం సరి కాదని ఆయన అన్నారు. ఏ ప్రాంతం పేపర్లు ఆ ప్రాంతంలోనే దిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రాంత పేపర్లు మరో ప్రాంతంలో దిద్దితే ప్రస్తుత భావోద్వేగాల వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ విషయమై రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని ఆయన చెప్పారు.