హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిఎం తెలంగాణ ప్రకటనపై నాగం విసుర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయ సాధనే శరణ్యమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనపై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏకాభిప్రాయ సాధన ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాదు వచ్చిన ఏకాభిప్రాయ సాధనకు పనిచేయాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజకీయ నేతలకే ఏకాభిప్రాయ సాధన సాధ్యం కానప్పుడు నిపుణులతో కూడిన శ్రీకృష్ణ కమిటీ ద్వారా ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెసు మరోసారి నడుం బిగించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనపై ఒక అభిప్రాయానికి వస్తే తమ పార్టీ కూడా ఒక అభిప్రాయానికి వస్తుందని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటన తర్వాత ప్రాంతాలవారీగా తమ రెండు పార్టీలు విడిపోయాయని, అటువంటప్పుడు ఏకాభిప్రాయం ఎలా సాధిస్తారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీని రాష్ట్ర విభజనకు వేశారా, కలిపి ఉంచడానికి వేశారా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X