హైదరాబాద్: భారత ప్రభుత్వం ఏటా ప్రకటించే జాతీయ ఉత్తమ పర్యాటక అవార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది. 2009 సంవత్సరానికిగాను రాష్ట్రం ఈ ఘనత సాధించినట్లు పర్యాటక మంత్రి గీతారెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో ఆరు అవార్డులను మన రాష్ట్రం గెలుచుకుంది. ఇందులో ఉత్తమ పర్యాటక వసతుల అభివృద్ధి, పర్యాటక సహాయకారి, గోల్ఫ్‌కోర్స్, టూరిజం ఫిల్మ్‌వంటి అవార్డులున్నాయి.
ఢిల్లీలో ఈ అవార్డులు అందుకున్న మంత్రి గీతారెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారు. రోశయ్య మాట్లాడుతూ పర్యాటక రంగానికి దేశంలో మనరాష్ట్రం ఉత్తమంగా నిలుస్తోందనడానికి ఇది మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్ లో రాష్ట్ర పర్యాటకరంగం మరింత ఉత్తమ స్థానాన్ని పొందాలని ఆకాంక్షించారు.