కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విప్రో ప్లేస్ మెంట్స్ కు మంచి స్పందన

By Santaram
|
Google Oneindia TeluguNews

Wipro
తిమ్మాపూర్‌( కరీంనగర్ జిల్లా): ఎల్‌ఎంటీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో కళాశాల యజమాన్యం, జేకేసీ ఐఈజీ, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో టెక్నాలజీస్‌ సంయుక్తంగా నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు విశేష స్పందన లభించింది.

జేకేసీ 2010లో నమోదైన కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెంది న 25 కళాశాలల విద్యార్ధులు ఈ ప్లేస్‌మెంట్స్‌కు హాజరయ్యారు. ప్లేస్‌మెంట్స్‌లో స్క్రీనింగ్‌ రౌండ్‌, వాయిస్‌ అసెస్‌మెంట్‌ (టెలిఫోనిక్‌), హెచ్‌ఆర్‌ ఇంటర్వూ, సంబంధిత విషయ పరి జ్ఞాన పరీక్ష (టెక్నికల్‌)లు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ ముద్దసాని లకారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ వాతావరణంలో ఉద్యోగాలు దొరకడం కష్టంగా భావించి విప్రో సంస్థ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులను కోరారు.

కళాశాల కరస్పాం డెంట్‌ ముద్దసాని రమేశ్‌ రెడ్డి మాట్లాడుతూ 1991 సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రపంచీకరణ తర్వాత దేశంలో మొదటిసారిగా గత రెండు సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాలలో ప్రైవేటు, బహుళ జాతి సంస్థలు ప్లేస్‌మెంట్స్‌ సెలక్షన్స్‌ జరుపకపోవడా న్ని ఉదహరించారు. ప్రిన్సిపాల్‌ ఆర్‌విఆర్‌కే చలం మాట్లాడుతూ స్టార్‌ జేకేసీ స్థాయి కలిగిన శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్ధులు భవి ష్యత్తు రిక్రూట్‌మెంట్‌లలో రాణించే విధంగా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో జేకేసీ ద్వారా అందిస్తున్న సేవలను ఐఇజీ ప్రోగ్రాం మేనేజర్‌ శ్రీకాంతరెడ్డి వివరించారు. రీజియన్‌లో శ్రీ చైతన్య జేకేసీ అద్భుత పనితీ రును, వి ద్యార్ధులకు కల్పిస్తున్న సదుపాయాల ను బి.సురేష్‌ కొనియాడారు.

విప్రో సంస్థ కేవలం పెద్ద పట్టణాలలోనే కాకుండా జిల్లా స్థాయిలో వివిధ కళాశాలల నుంచి పట్టభద్రులవుతున్న విద్యార్ధులలో ఉన్న విషయ అవగాహాన, సంస్థ ఉద్యోగులకు కావాల్సిన నైపుణ్యం ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకోడానికి ముందుకు వస్తుందని విప్రో ప్రతినిధులు భవిన్‌ భూజారా, ఫారూఖ్‌ అహ్మద్‌లు తెలిపారు. శ్రీ చైతన్య కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X