హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో కర్నూలు వరదలపై వాగ్వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కర్నూలు వరదలపై మంగళవారం శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. కర్నూలు వరదలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టేందుకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యతో తెలుగుదేశం సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తెలుగుదేశం సహా ప్రజారాజ్యం,త వామపక్షాలు వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన పునరావాస చర్యలపై ధ్వజమెత్తాయి. సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నాయి. వరదల వల్ల ప్రజలు తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో, మంత్రులు పడవల్లో షికార్లు చేశారని వారు వ్యాఖ్యానించారు.

అంతకు ముందు చంద్రబాబు కర్నూలు వరదలపై ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. వరదల సమయంలో బాధితులకు ప్రభుత్వం నరకం చూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవ తప్పిదం వల్లనే కర్నూలుకు వరదలు వచ్చాయని ఆయన అన్నారు. శ్రైశీలం నుంచి సకాలంలో కిందికి నీరు వదిలి ఉంటే ప్రమాదాన్ని నివారించి ఉండగలిగేవాళ్లని ఆయన అన్నారు. కర్నూలు ప్రజలను శ్రీశైల మల్లికార్జునుడే కాపాడాడని ఆయన అన్నారు. వరదల వల్ల ప్రజలు బాధపడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు తమాషా చూశారని ఆయన అన్నారు. మంత్రులు వరద తాకిడి ప్రాంతాల్లో కనీసం పర్యటనలు కూడా జరపలేదని ఆయన అన్నారు. వరద బాధితులు తిండి కూడా లేకుండా బాధపడుతుంటే మంత్రులు సంబరాలు చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు నరకాన్ని చూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. వరదలు మానవ తప్పిదం కాదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X