అమ్మను చూడడానికే వచ్చా: బాలకృష్ణ

అనూహ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తన సవతి తల్లి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతితో భేటీ అయ్యారు. బాలకృష్ణ లక్ష్మీపార్వతి ఇంటికి వచ్చారు. ఆయనే కారు నడుపుకుంటూ వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ మరణించిన తర్వాత లక్ష్మీపార్వతిని బాలకృష్ణ కలవడం ఇదే తొలిసారి. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు చర్చలు జరిగాయి.
ఆస్తుల వివాదం విషయంలో వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు తానే వారసురాలిని అంటూ లక్ష్మీపార్వతి అంటున్నారు. వివాదం కోర్టులో కూడా ఉంది. ఇప్పటికి 14 ఏళ్లు గడిచినప్పటికీ ఏ విధమైన పరిష్కారం రాలేదు. దీంతో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు బాలకృష్ణ సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో ఓ రాజీ ఫార్ములాను బాలకృష్ణ లక్ష్మీపార్వతి ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications