హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి రామలింగరాజుకు మరో ఆరు వారాల పాటు వైద్యం అందించాల్సి ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు గురువారం ఒక నివేదిక అందించారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తే రామలింగరాజు ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని వారు తెలిపారు. దీంతో సత్యం కేసు విచారణకు రామలింగ రాజు మినహా మిగతా నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
కాగా, సత్యం కేసు విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు మినహా మిగతా తొమ్మిది మంది నిందితులను పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగరాజు నిమ్స్ లో వైద్యం పొందుతున్నారు.