మావోయిస్టు నేత కొండల్ రెడ్డి హతం

Maoists
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో ప్రముఖ మావోయిస్టు నాయకుడు పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో శుక్రవారం హతమయ్యాడు. మృతి చెందిన మావోయిస్టు నేతను మావోయిస్టు దక్షిణ భారత టెక్నికల్ ఇంచార్జీ సోలిపేట కొండల రెడ్డి అలియాస్ టెక్ రమణగా అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. ఘటనా స్థలానికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించడం లేదు. ఘటనా స్థలంలో ఒక ఎకె 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

గత 22 ఏళ్లుగా కొండల్ రెడ్డి అజ్ఞాతంలో ఉంటున్నాడు. దక్షిణ తెలంగాణ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా అతను పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డికి అతను సన్నిహిత బంధువు. సోలిపేట కొండల రెడ్డి అలియాస్ సోలిపేట వెంకట రెడ్డి అలియాస్ టెక్ రమణది మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం.

సోలిపేట కొండల్ రెడ్డి ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం అతన్ని మహారాష్ట్రలోని పూణేలో పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొండల రెడ్డిది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటర్ అని, రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో పోలీసులు పట్టుకున్నారని, ఇక్కడికి తీసుకు వచ్చి కాల్చి చంపారని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు అంటున్నారు.

కొండల రెడ్డిది ముమ్మాటికీ హత్యేనని మాజీ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆరోపించారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యత వహించాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ చేసినవారిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+