హైదరాబాద్: రెండు జిల్లాల్లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లపై రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. ప్రకాశం జిల్లాలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు, వరంగల్ జిల్లాలో సోలిపేట కొండలరెడ్డి హతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్లపై ఆమె పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ తో మాట్లాడారు.
సంఘటనా స్థలాలకు ఇద్దరు ఎస్పీలు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తానని సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. శాఖమూరి అప్పారావు మృతిని ప్రకాశం జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.