ఇటావా : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తృటిలో విమాన ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇటావాలోని విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు రన్‌వేపై ఒక వ్యక్తి సైకిల్‌తో వచ్చాడు. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.