సీమాంధ్ర ఎమ్మెల్యేలకు రోశయ్య బుజ్జగింపు

తీర్మానంతో సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తమ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బుధవారం శాసనసభలో ప్రకటించారు. అంతే కాకుండా అందుకు గాను బుధవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించారు. చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడానికి అఖిల పక్ష సమావేశం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తెల్లారే సరికి పరిస్థితి తారుమారైంది. ఈ గండం నుంచి రోశయ్య ఎలా గట్టెక్కుతారనేది వేచి చూడాల్సిందే.
పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులు ఒక్కటయ్యారు. తీర్మానాన్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు. దీంతో రోశయ్యకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులే కాకుండా సిపిఎం, సిపిఐ శాసనసభ్యులు కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తీర్మానం గురువారం శాససనభలోకి వస్తుందా, లేదా అనేది కూడా అనుమానమే. మంచినీటి ఎద్దడిపై గురువారం ఉదయం నుంచే శాసనసభలో గొడవ జరుగుతోంది. ఉదయం పది గంటల వరకే శాసనసభ రెండు సార్లు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications