డర్బన్: జాతిపిత మహాత్మ గాంధీ సహధర్మచారిణి కస్తూర్బా గాంధీపై దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రదర్శన ఏర్పాటయింది. ఇక్కడి కోర్టుహాల్‌లో గాంధీజీ మనుమరాలు ఈలా గాంధీ శనివారం ఈ ప్రదర్శనను ప్రారంభించారు. జూలై వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.
కస్తుర్బా గాంధీకి చెందిన అరుదైన చిత్రాలు, ఆమె గురించి రాసిన పుస్తకాలు ఇందులో ఉంచారు. మొక్కవోని ధైర్యంతో భవిష్యత్ తరానికి కస్తుర్బా ఆదర్శంగా నిలిచారని ఈలా గాంధీ అన్నారు.