బెంగళూరు: రాసలీలల కేసులో స్వామి నిత్యానందకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఎలాంటి విచారణ చేపట్టకుండా స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన అర్జీని కర్ణాటక హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. దర్యాప్తు నెపంతో తనను అరెస్టు చేసే అవకాశాలున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న విజ్ఞప్తిని కూడా కొట్టి వేసింది. న్యాయమూర్తి ఏ. నాగరాజ్‌తో కూడిన ఏక సభ్య న్యాయ పీఠం నిత్యానందపై విచారణను కొనసాగించడానికి అనుమతినిచ్చింది. రాసలీలలను బట్టబయలు చేసిన నిత్యానంద కారు డ్రైవరు లెనిన్‌ను హాజరు పరచాల్సిందిగా ఆదేశించింది.
అత్యాచారం సహా నిత్యానందపై దాఖలైన వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించిన రికార్డులను, పత్రాలను శుక్రవారంలోగా సమర్పించాలని నగరంలోని బిడదని పోలీసులను ఆదేశిస్తూ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.