హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలం బండ్లగూడలో ఓ ప్రేమ జంట గురువారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆ ప్రేమికులు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు వేసుకుని సేవించారు. రాజశేఖర్ అనే యువకుడు, మరో యువతి చాలా కాలంగా తమ పెద్దలను పెళ్లికి అంగీకరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రేమికులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయాన్ని గమనించి స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిని 108 అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.