కరీంనగర్: అర్హులైన మరో 5 లక్షల మందికి మేనెలలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ చివరినాటికి బోగస్ రేషన్‌కార్డుల ఏరివేత పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.
5 నుంచి 8 శాతం బోగస్ రేషన్‌కార్డులు గుర్తించామని పేర్కొన్నారు. ఏరివేత ప్రక్రియలో అర్హులు కార్డులు కోల్పోతే గ్రామసభలు నిర్వహించి వాటిని పునరుద్ధరిస్తామని తెలిపారు.