మైనారిటీలకు సబ్ కోటా: టిడిపి

రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమమ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు పొలిట్‌బ్యూరో సభ్యులను ఆదేశించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వాడవాడలా పసుపు పండగ ఘనంగా నిర్వహించాలని సూచించారు. శాసనసభ సమావేశాల కారణంగా రాజధానిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండిపోవడంతో మిగతా నాయకత్వం వ్యవస్థాపక దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications