పాతబస్తీ ప్రశాంతతకు సహకరించండి: సిఎం

Rosaiah
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత పరిస్థితుల కల్పనకు సహకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య రాజకీయ పార్టీలను కోరారు. పాతబస్తీ అల్లర్లపై ఆయన సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు మజ్లీస్ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. వారికి సర్దిచెప్పేందుకు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు. పాతబస్తీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి తగిన సూచనలు ఇవ్వాలని, ఆ మేరకు తాము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ముఖ్యమంత్రి మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ కు హామీ ఇచ్చారు.

పాతబస్తీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర బలగాలను రప్పించామని ఆయన చెప్పారు. కేంద్ర హోం మంత్రి చిదంబరంతోనూ యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తోనూ మాట్లాడానని ఆయన చెప్పారు. పాతబస్తీ అల్లర్లపై సోనియా ఆరా తీశారని ఆయన చెప్పారు. ప్రశాంతతను నెలకొల్పడానికి సహకరించాలని తన మాటగా విజ్ఞప్తి చేయాలని సోనియా చెప్పినట్లు ఆయన తెలిపారు. పాతబస్తీలో ప్రశాంతతకు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్ర బలగాలు వచ్చాయని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు. ప్రశాంత వాతావరణ కల్పనకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు.

పాతబస్తీ పరిస్థితిపై అధికారులతో తాను సమీక్షిస్తూనే ఉన్నానని ఆయన చెప్పారు. పాతబస్తీ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. అల్లర్ల వల్ల పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులను గుర్తించి మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని పాఠశాల విద్యామంత్రి మాణిక్యవరప్రసాద్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+