తెలంగాణలో జగన్ యాత్ర వద్దు: యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: 'ఓదార్పు' పేరిట తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన రెడ్డి పర్యటనకు ఇది సరైన సమయం కాదని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సీమాంధ్రలో తిరిగితే ఫర్వాలేదని, కానీ తెలంగాణలో పర్యటించకపోవడమే మంచిదని, ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర డీజీపీ గిరీశ్ కుమార్ తెలంగాణ వ్యతిరేకి అని, కేంద్ర ప్రభుత్వానికి ఆయన తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఈ ప్రాంత ఉద్యోగులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి, కేసులు బనాయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా సంఘాలన్నీ ఐక్యంగా పని చేయాలని యాష్కీ సూచించారు. ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మంచిది కాదన్నారు. సీమాంధ్ర తొత్తులని, కలిసి పోరాడడం లేదని, పదవులు, రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని తెలంగాణ ప్రాంత నేతలను విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. పదవులు త్యాగం చేసిన వారిని ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, వారి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని తమ పార్టీ అధిష్ఠానాన్ని కోరతానని యాష్కీ తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉందని, ఈ ప్రాంతంలో పర్యటించనున్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వాస్తవాలు బోధపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+