చెన్నై: తనను ముందస్తుగా విడుదల చేయాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది. నళిని ముందస్తు విడుదల అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం మార్చి 11వ తేదీన చెప్పింది. జైళ్ల సలహా బోర్డు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించినట్లు సమాచారం.
ప్రభుత్వ నియంత్రణలో లేని కొన్ని కారణాల వల్ల నిర్ణయం తీసుకునే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, కోర్టును తాము మరింత సమయం అడుగుతున్నామని తమిళనాడు ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ పిఎస్ రామన్ చెప్పారు.