వైష్ణవి హత్య, 60 రోజులు గడిచినా...

నార్కో అనాలిసిస్ పరీక్షలకు విముఖత చూపిన వెంకట్రావు సోమవారం అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. నార్కో పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీసుల దాఖలు చేసిన పిటిషన్‌లో తన వాదనను వినాలని కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రావడంతో వెంకట్రావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వైష్ణవి కేసులో వెంకట్రావు ప్రమేయం ఎంత మాత్రం లేదని అతని న్యాయవాదులు వాదించారు.
ఇప్పటి వరకు కోర్టులో నిందితులని హాజరుపరచడం, నిందితుల గుర్తింపు ప్రక్రియ జరిగింది మినహా కేసు అసలు విచారణ మొదలైంది లేదు. పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జీషీట్ దాఖలు చేయాలి. లేదంటే కేసులో నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 రోజులు పూర్తికాగా, ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు కీలకమైనందున నివేదికలు హైదరాబాద్ నుంచి అందాలి. నార్కో అనాలిసిస్ పరీక్షలు జరిగితే తదనుగుణంగా ఛార్జీషీట్‌లో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పూర్తయితేనే కోర్టులో నాగ వైష్ణవి కేసు విచారణ మొదలుకాదు. నెల రోజుల సమయంలోను పోలీసులు పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications