నకిలీ బీమా సంస్ధతో మోసపోయిన జనం

Vijaywada
విజయవాడ: 'నెలకు రూ.190 చొప్పున ఐదేళ్లపాటు చెల్లిస్తే మీరు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.75వే ఇస్తాం. షుగర్‌ వ్యాధితో మరణిస్తే రూ.50 వేలు ఇస్తాం. బీపీతో మరణిస్తే రూ.25వేలు ఇస్తాం'. ఇలా మధ్యతరగతి ప్రజలకు ఆశ చూపిన ఓ జంట ఐదేళ్లుగా డబ్బు దండుకుని చివరికి మాట మార్చిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (ఐఆర్‌డీఎస్‌) ఉందనీ, ఆ సంస్థ నగర శాఖను తాము నిర్వహిస్తున్నామని విజయవాడలోని హెచ్‌బీ కాలనీలో నివసిస్తున్న జాన్ ‌బాబు దంపతులు అందరినీ నమ్మించారు. తమ సంస్థలో నెలకు రూ.190 చొప్పున ఐదేళ్లపాటు చెల్లించిన వారికి జీవిత బీమా సదుపాయం కల్పిస్తారని చెప్పారు.

అంతేకాకుండా నెలనెలా బీపీ, షుగర్‌ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మి కృష్ణలంకకు చెందిన సుమారు 70మంది డబ్బు చెల్లించారు. ఇప్పటివరకూ రూ.3లక్షల వరకూ ఈ ప్రాంతవాసులు చెల్లించినట్లు సమాచారం. ఇటీవల ఈ సంస్థ పేరు మార్చి కారుణ్య షిఫ్రా డయాబెటిక్‌ కేర్‌ సొసైటీగా మార్చినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+