హైదరాబాద్ పాతబస్తీ ప్రశాంతం

పాతబస్తీలో భారీగా పోలీసులను మోహరించారు. కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ పాతబస్తీలో పర్యటిస్తూ పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ కూడా హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించారు. పాతబస్తీలోని ప్రతి గల్లీలో పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రజల అవసరాలు కనుక్కుంటూ తగిన సాయం అందజేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ పాతబస్తీలో పెద్ద యెత్తున అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని గమనించి పోలీసులు కర్ఫ్యూ విధించారు.












Click it and Unblock the Notifications