ఉప్పలపాడు బాధితులను ఆదుకుంటాం: సిఎం

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద గురువారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. మృతులంతా ప్రకాశం జిల్లా చిన్నదోర్నాలకు చెందిన వారని తెలుస్తున్నది. సిమెంట్ లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈస్టర్ పండుగ సందర్భంగా మాచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications