నిత్యానంద అరెస్టులో పోలీసుల తాత్సారం

పరిస్థితి తారుమారైంది. మార్చి నాలుగున నటి రంజితతో రాసలీలల ప్రక్రియ వెలుగు చూసిన తరువాత ఆయన ఎవరికీ కనిపించకుండా వెళ్లి నెలరోజులు కావస్తోంది. కామకేళికి-తనకు సంబంధం లేదని మొదట బుకాయించారు. అనంతరం వీడియోలో ఉంది తానేనని అంగీకరించారు. అయితే తాను మగతగా ఉన్నప్పుడు వాటిని చిత్రీకరించారని వాదిస్తూ వీడియోలను విడుదల చేశారు. ఒక వారంలోగా భక్తుల ముందుకు వచ్చేస్తానంటూ ఆ వీడియోల్లో ప్రకటించారు. ప్రకటనలు చేస్తూనే ముందస్తు జామీను కోసం రామనగర కోర్టులో అర్జీ వేసుకున్నారు. కోర్టు జామీను నిరాకరించింది. మరోసారి ఆయన అర్జీ వేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలకు తమకు ఇంకా అందనందున జామీను ఇవ్వటం సాధ్యం కాదని, న్యాయమూర్తి తెలిపారు.
హరిద్వార్‌లో కుంభమేళా ఉత్సవాల్లో పాల్గొంటున్నానని నిత్యానంద విడుదల చేసిన వీడియోలో ప్రకటించారు. కుంభమేళా ముగిసినా ఆయన జాడ లేదు. తమిళనాడులో నిత్యానందపై నమోదైన కేసులను అక్కడి పోలీసులు నగర పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు పత్రాలన్నీ తమిళంలో ఉన్నాయి. వీటిని కన్నడ, ఆంగ్ల భాషల్లోకి అనువదించే ప్రక్రియ ప్రారంభమైంది. తాను ఆశ్రమ బాధ్యతలను వదలి పెడుతున్నట్లు నిత్యానంద తాజాగా వీడియో ప్రకటన చేశారు. పూర్వాశ్రమంలో మౌనంగా తపస్సు చేసుకున్నట్లే ఎవరికీ కనిపించకుండా వెళ్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications