మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో నలుగురు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. కుటుంబ కలహాల కారణంగా వీరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం.
ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెను గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.