హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎకె ఖాన్ అంటే మజ్లీస్ కు పడదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: హైదరాబాద్ ప్రస్తుత పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అంటే మజ్లీస్ కు అసలు పడదని అంటారు. ఆయన లౌకిక భావనలు, అందుకు అనుగుణమైన చర్యలు మజ్లీస్ కు ఇబ్బంది కలిగించినట్లు చెబుతారు. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో మజ్లీస్, బిజెపిల రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి ఎకె ఖాన్ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆయన అందులో సఫలం కాలేదు. అనూహ్యంగా ఖాన్ బదిలీ అయ్యారు. నగర అదనపు కమిషనర్ గా గతంలో బాధ్యతలు చేపట్టిన ఎకె ఖాన్ హైదరాబాద్ పాతబస్తీలో వామపక్ష రాజకీయాలను ప్రోత్సహించారని అంటారు.

ఎకె ఖాన్ చొరవతో సిపిఎం, సిపిఐ పాతబస్తీలో తమ రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. సిపిఎం రాజ్యసభ సభ్యుడు మధును పాతబస్తీ రాజకీయ బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో మజ్లీస్ కు, సిపిఎంకు మధ్య పలు వివాదాలు కూడా చెలరేగాయి. మజ్లీస్, బిజెపిల రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పన్నిన ఖాన్ వ్యూహం మజ్లీస్ నేతలకు కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. దీంతో మజ్లీస్ నేతలు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఖాన్ బదిలీ చేయించారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ కమిషనర్ గా రావడంతో మజ్లీస్ కు మింగుడు పడడం లేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X