పెషావర్: పాకిస్తాన్ లో సోమవారం మూడు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 36 మంది దాకా మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాడి జరిగింది. సెక్యులర్ అవామీ నేషనల్ పార్టీ ర్యాలీలో ఆత్మాహుతి దాడి జరిగింది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్ పేరు మార్పును వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలో బాంబు పేలినట్లు ఎఎన్పీ పార్టీ అధికార ప్రతినిధి జహీద్ ఖాన్ చెప్పారు.
అమెరికా ఎంబసీని లక్ష్యంగా చేసుకుని కూడా ఈ దాడి జరిగింది. పెషావర్ లో 20 నిమిషాల వ్యవధిలో పెషావర్ లో మూడు చోట్ల అత్మాహుతి దాడులు జరిగాయి. సంఘటనలు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితి బీభత్సంగా ఉంది.