గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు- సికింద్రాబాద్ వేసవి ప్రత్యేక రైలు సర్వీసు

By Santaram
|
Google Oneindia TeluguNews

Special Summer Train
గుంటూరు: వేసవి కాలంలో రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ కు వారానికి ఒక రోజు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు గుంటూరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఎన్ రంగారావు తెలిపారు. రెండు నెలల పాటు ఈ రైలు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ రైలును 0713ఎగా నడుపుతున్నామన్నారు. ఇదే రైలు సికింద్రాబాద్ నుంచి 0714 ఎగా గుంటూరు చేరుకుంటుందన్నారు.

గుంటూరు నుంచి బయలుదేరే రైలు ఏప్రిల్ 10,17,24, మే 1,8,22,29 తేదీల్లో నడుస్తుందని, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు, ఏప్రిల్ 9,16,23,30, మే 7,14,21,28 తేదీలలో చేరుతుందన్నారు. గుంటూరు నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు వెళుతుందన్నారు. ఈ రైలులో అన్ని జనరల్ బోగీలనే కేటాయించటం జరిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X