చెన్నై: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును మద్రాసు హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. తన ముందస్తు విడుదల విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించడంపై నళిని హైకోర్టుకు వెళ్లింది. ప్రిజన్ అడ్వయిజరీ బోర్డు కమిటీ సభ్యులు తన ముందస్తు విడుదల విజ్ఞప్తిని అంగీకరించారని, ప్రభుత్వానికి అందుకు అనుగుణంగా నివేదిక సమర్పించారని, రోయపెట్ట పోలీసు స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తన విడుదలకు నిరాకరించడం సరైంది కాదని నళిని తన పిటిషన్ లో వివరించింది.
నళిని వెల్లూరు కేంద్ర కారాగారంలో ఉంది. తాను 14 ఏళ్ల శిక్ష అనుభవించినందున 2005 తర్వాత తనకు విడుదలయ్యే హక్కు ఉందని నళిని వాదించింది.