'ఆయుధ రూపంతో తెలంగాణ ఉద్యమం'

గత నవంబర్‌లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని, తెలంగాణ రాష్ట్ర సాధనను ప్రజలు కోరుకుంటుంటే తమ పదవులు, స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల నాయకులు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగానడు చుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, కూలీ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.
విద్యార్థులు, యువ కులు తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తు న్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం పదవులను వదులుకోవడం లేదని ఆయన విమర్శించారు. హైద రాబాద్‌లో ఉన్న ఆస్తులను, అస్తిత్వా న్ని కాపాడుకోవటానికి సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
గ్రామాల్లో జేఏసీ ఉద్యమాలు మొదటి దశలో ఉన్నాయని, రాజస్థాన్ లో గుజ్జర్ల తర హాలో మిలిటెంట్ పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కొంత కాలం కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టడానికి శ్రీ కృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిం చిందని సాంబశివుడు చెప్పారు. 2014లో తెలంగాణ ఏర్పడుతుందని అప్పటి వరకు ఉద్యమాన్ని బతికించాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతి పౌరుడి పై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications