హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసది మతిలేని వాదన: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మతిలేని వాదనలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో చివరలో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పేర్కొన్న అంశమే ఇందుకు తార్కాణమని ఆయన అన్నారు. ఈ మేరకు కమిటీ సభ్య కార్యదర్శి వీకే దుగ్గల్‌కు లగడపాటి గురువారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన ఒక్కటే పరిష్కారమార్గమని, రాష్ట్రావతరణకు పూర్వ స్థితి - అంటే 1956 నవంబర్ 1 కంటే ముందున్న భౌగోళిక పరిస్థితులు అలాంటి యథాతథ స్థితిని కొనసాగించడమే ఉత్తమమని శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో కేసీఆర్ పేర్కొనడంలోనే అసహనం బయటపడుతోందని ఆయన అన్నారు.

అది తెరాస నేతల్లో ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తోందని అన్నారు. 1956 నవంబర్ 1వ తేదీకి ముందున్న పరిస్థితి అంటే పూర్వ హైదరాబాద్ రాష్ట్రాన్ని కోరుకోవడమేనని ఆయన అన్నారు. అందులో తెలంగాణ జిల్లాలతో పాటు ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న మరో 8జిల్లాలు కూడా ఉండేవని చెప్పారు. దీన్నిబట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దులను మళ్లీ గుర్తిస్తూ 'రీ-డ్రాయింగ్' చేయాలని తెరాస కోరుకుంటోందని అవగతమవుతోందని పేర్కొన్నారు. కల్పిత ఉద్యమాన్ని ప్రారంభించాక ఇప్పుడు అందుకు కారణాలను తెరాస వెతుక్కుంటోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జిల్లాలు స్వీయపాలన చేసినట్లు చరిత్రలో దాఖలాలు లేవన్నారు. లేని దాన్ని ఎలా పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు. తప్పుడు నివేదికను సమర్పించిన తెరాస వాదనను తోసిపుచ్చాలని ఆయన దుగ్గల్‌ను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X