ఎసిబి వలలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్

Karimnagar Dist
కరీంనగర్‌: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో పెద్ద అవినీతి చేప చిక్కింది. ఎస్సారెస్పీ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ అన్నం నాయుడు నివాసాలపై ఈ ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కరీంనగర్‌, శ్రీకాకుళం, హైదరాబాద్‌ జీడిమెట్లలోని నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై ఏసీబీ ఈ దాడులను నిర్వహించింది. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అన్నం నాయుడు తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడుకు దూరపు బంధువని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+